తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఏకంగా 15 బంగారు పతకాలు అందజేత
తిరుమల, 22 సెప్టెంబర్ (హి.స.) కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఇటీవల కాలంలో భక్తులు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామిజీ శ్రీవారికి ఏకంగా 15 బంగారు పతకాలు, రెం
huge-donation-to-tirumala-srivaru-15-gold-medals-presented-at-once-477315


తిరుమల, 22 సెప్టెంబర్ (హి.స.)

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఇటీవల కాలంలో భక్తులు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామిజీ శ్రీవారికి ఏకంగా 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చారు. వాటి విలువ సుమారు 1.80 కోట్లు ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కానుకలను శ్రీవారి ఆలయ ఆవరణలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామిజీ స్వామి అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande