.మరో ‘థార్’ ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌
దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.) రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్‌’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జా
Accident


దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.) రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్‌’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ‍ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

బలంగా డివైడర్‌ను ఢీకొని..

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ‘థార్‌’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్‌కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande