ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్
బరేలీ/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)-ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు. అయితే ఈ
ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్


బరేలీ/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)-ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో బరేలీ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తౌకీర్ రజా ఇంటి వెలుపల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలివచ్చి ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande