దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)
భారత అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. దీంతో ఈ నెల 30న ముగియాల్సిన ఆయన పదవీకాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆయన 2022లో కె.కె.వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. 1950 ఏప్రిల్ 13న పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1979లో తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేటుగా గుర్తింపునిచ్చింది. వెంకటరమణి 2010 నుంచి 2013 వరకూ లా కమిషన్ సభ్యునిగా పనిచేశారు. రాజ్యాంగంలోని 76(1) అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అటార్నీ జరనరల్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ