భద్రతా బలగాలకు చిక్కిన మావోయిస్టుల ఆయుధ కార్ఖానా
తెలంగాణ, భద్రాచలం. 27 సెప్టెంబర్ (హి.స.) మావోయిస్టులు ఆయుధాలు పట్టి సైద్ధాంతిక యుద్ధం చేయడమే కాదు... ఆయుధాలు తయారు చేయడంలో కూడా సిద్దహస్తులే. ఎస్ ఎల్ ఆర్ నుండి రాకెట్ లాంచెర్ వరకు ఆయుధాలను వారే స్వయంగా తయారు చేసి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటారు. ఆ
మావోయిస్టు ఆయుధాలు


తెలంగాణ, భద్రాచలం. 27 సెప్టెంబర్ (హి.స.)

మావోయిస్టులు ఆయుధాలు పట్టి

సైద్ధాంతిక యుద్ధం చేయడమే కాదు... ఆయుధాలు తయారు చేయడంలో కూడా సిద్దహస్తులే. ఎస్ ఎల్ ఆర్ నుండి రాకెట్ లాంచెర్ వరకు ఆయుధాలను వారే స్వయంగా తయారు చేసి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటారు. ఆయుధాలు తయారీ కోసం మావోయిస్టులే ఇంజనీర్లు కూడా ఉంటారు. ఇదంతా వాస్తవమే అని తెలియజేసే విధంగా భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

అక్కడ టెక్నాలజీ చూసి బలగాలు ఆశ్చర్యపోయారు. వివరాలలోకి వెళ్తే.. ఛత్తీస్ఫడ్ సుకుమా జిల్లా, మెట్ట గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. అక్కడ భారీగా ఆయుధాలు, ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు తయారీకి వాడే పరికరాలు బలగాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆయుధ కార్ఖానాలు బలగాలు గుర్తించినా... ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కర్మాగారం కాదని బలగాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande