దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.), : పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగించాలని భారత్, అమెరికా నిర్ణయించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాణిజ్య చర్చల నిమిత్తం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో న్యూయార్క్‌కు వెళ్లిన భారత ప్రతినిధుల బృందం మూడు రోజుల చర్చల అనంతరం బుధవారం భారత్‌కు తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాలు నిర్మాణాత్మక సమావేశాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఒప్పందంలోని వివిధ అంశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయని, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకునేందుకు చర్చలను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. కాగా తదుపరి చర్చలకు సంబంధించిన తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. భారత్‌పై తొలుత 25శాతం సుంకం విధించిన అమెరికా.. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25శాతం సుంకాన్ని విధించడంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరిం ది. కాగా భారత్ 25శాతం అదనపు సుంకాన్ని తొలగించాలని కోరినట్టు ఓ అధికారి తెలిపా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ