ఎన్డీయేపై ప్రియాంక ధ్వజం -డబ్బులు ఎరవేసి ఓట్లు దండుకోవాలని కుట్ర
పట్నా:/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.) భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అందించే చిరు బహుమతులను చూసి మోసపోవద్దని, వారికి ఓట్లు తప్ప మరేమీ అక్కర్లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బిహార్‌ మహిళలకు విజ్ఞప్తిచేశారు. శుక్రవారం బిహార్‌ల
Priyanka Gandhi


పట్నా:/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అందించే చిరు బహుమతులను చూసి మోసపోవద్దని, వారికి ఓట్లు తప్ప మరేమీ అక్కర్లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బిహార్‌ మహిళలకు విజ్ఞప్తిచేశారు. శుక్రవారం బిహార్‌లో పర్యటించిన ఆమె...‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ను ఉద్దేశించి మాట్లాడారు. దీని వెనుక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, సీఎం నీతీశ్‌ కుమార్‌ అసలు ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని మహిళలను కోరారు. ‘‘ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తోంది. కానీ...ఈ పథకం ప్రతి నెలా కొనసాగుతుందన్న హామీని వారు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. కపట బుద్ధిని ముందుగానే పసిగట్టే సామర్థ్యం స్త్రీలకు ఉంటుంది. మీకు గౌరవం, భద్రత అవసరమని వారు అర్థం చేసుకోవడం లేదు. గత పదేళ్లలో రాష్ట్రంలో మహిళలపై నేరాలు పదిరెట్లు పెరిగాయి’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande