చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో ఉగ్రవాదులు: బీఎస్‌ఎఫ్‌ ఐజీ
శ్రీనగర్‌/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.) : జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో అంతర్జాతీయ సరిహద్దు (Border)ను దాటుకొని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) చేసే ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అయినప్పటికీ దేశానికి ఉ
Bsf


శ్రీనగర్‌/దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)

: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో అంతర్జాతీయ సరిహద్దు (Border)ను దాటుకొని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) చేసే ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అయినప్పటికీ దేశానికి ఉగ్రముప్పు పొంచి ఉంటుంది. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి లాంఛ్ ప్యాడ్ల వద్ద (LoC launch pads) ఉగ్రవాదులు (Terrorists) కాపు కాస్తున్నాయని బీఎస్‌ఎఫ్‌ (BSF) ఐజీ అశోక్‌ యాదవ్‌ తెలిపారు. కశ్మీర్‌ లోయలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు నియంత్రణ రేఖ వెంబడి కాపు కాస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటుయత్నాలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande