ఛత్తీస్‌గఢ్‌లో కీలక మావో జంట అరెస్ట్..జంటపై రూ.13 లక్షల రివార్డు
దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.) మావోయిస్టుల ఏరివేతలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు మావోయిస్టు జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గు కుర్సం అలియాస్ రవి అలియాస్ రమేష్ (28), అతని భార్య కమలా కుర్సం (27) ను సెప్టెంబర్ 23న చంగోరభట్ట దగ్గ
Maoist


దిల్లీ: 27, సెప్టెంబర్ (హి.స.)

మావోయిస్టుల ఏరివేతలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు మావోయిస్టు జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గు కుర్సం అలియాస్ రవి అలియాస్ రమేష్ (28), అతని భార్య కమలా కుర్సం (27) ను సెప్టెంబర్ 23న చంగోరభట్ట దగ్గర అరెస్టు చేశారు. నిర్మాణ కార్మికులుగా నటిస్తూ… ఇళ్లను అద్దెకు తీసుకుని నెట్‌వర్క్‌ నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ జంటపై రూ.13 లక్షల రివార్డు ఉంది. జగ్గుకు రూ. 8 లక్షల బహుమతి, కమలకు రూ. 5 లక్షల బహుమతి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

జగ్గు కుర్సం మావోయిస్టు ప్రయాణం 11 సంవత్సరాల వయసులోనే ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలతో పోరాడాడు. డివిజనల్ కమిటీ సభ్యురాలు (DVC)గా ఎదిగాడు. అతని భార్య కమల 2014లో యుక్తవయసులో నక్సల్ హోదాలో చేరింది. చివరికి ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) అయింది. ఇద్దరూ అడవుల్లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. అనంతరం వివాహం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande