డిల్లీ, 28 సెప్టెంబర్ (హి.స.)దిల్లీలో ఓ ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబా (Delhi Baba)పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ బాబా (స్వామి చైతన్యానంద సరస్వతి)ను పోలీసులు అరెస్టు చేశారు.
వసంత్‌కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ కళాశాల నిర్వహణ కమిటీలో స్వామి చైతన్యానంద సరస్వతి సభ్యుడిగా ఉన్నారు. బాబా తమను లైంగికంగా వేధించాడంటూ ఆ కాలేజీలోని 17 మంది విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడం, అభ్యంతరకర సందేశాలు పంపడంతో పాటు విదేశీ పర్యటన పేరుతో మభ్యపెట్టేవాడని వారు ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు