దిల్లీ: 28 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 28) తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 126వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. ముందుగా ఆయన స్వాంతత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు నివాళులర్పించారు. భగత్ సింగ్ ప్రతి భారతీయునికి, ముఖ్యంగా దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకుడని అన్నారు. ఉరి తీయడానికి ముందు భగత్ సింగ్.. బ్రిటిష్ వారికి ఒక లేఖ రాశారు. ‘నన్ను, నా సహచరులను యుద్ధ ఖైదీలుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఉరితీయడంతో కాకుండా నేరుగా కాల్చి చంపడం ద్వారా మా ప్రాణాలను తీయాలి’ అని ఆయన కోరారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
లతా మంగేష్కర్ జయంతి కూడా ఈ రోజే కావడంతో ప్రధానమంత్రి ఆమెను స్మరించుకున్నారు. ఆమె పాడిన దేశభక్తి గీతాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని అన్నారు. లతా దీదీకి హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఆమె ప్రతి సంవత్సరం తప్పకుండా నాకు రాఖీ పంపేదని ప్రధాని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపతో సంభాషించారు. ఈ ఇద్దరు ధైర్యవంతులైన అధికారులను ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నానని అన్నారు.
ఛత్ పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ