వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధం
డిల్లీ, 28 సెప్టెంబర్ (హి.స.)లేహ్‌: లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతోపాటు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమం సాగిస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ జైలుకు తరలించిన
వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధం


డిల్లీ, 28 సెప్టెంబర్ (హి.స.)లేహ్‌: లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతోపాటు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమం సాగిస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ జైలుకు తరలించిన పోలీసులు ఆయనపై కొత్త కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ నిరసనల్ని ఒక పాకిస్థానీ గూఢచారి తమ దేశంతో పంచుకున్న నేపథ్యంలో వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయా అనే విషయంపై విచారణ జరుపుతున్నామని లద్దాఖ్‌ డీజీపీ ఎస్‌.డి.సింగ్‌ జామ్వల్‌ శనివారం వెల్లడించారు. వాంగ్‌చుక్‌ ప్రసంగాన్ని పరిశీలిస్తే.. ఆయన ప్రజల్ని ఉసిగొల్పారని అర్థమవుతోందన్నారు. తాము కాల్పులు జరపకపోతే లద్దాఖ్‌ యావత్తూ కాలి బూడిదయ్యేదని చెప్పారు. లద్దాఖ్‌ ప్రాంతంలో మూడు రోజులుగా విధించిన కర్ఫ్యూను సడలించడంతో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande