రోజూ కిడ్నీ బీన్స్ తింటే ఏమవుతుంది? - నిపుణుల సమాధానం ఇదే!
కర్నూలు, 28 సెప్టెంబర్ (హి.స.) ''రాజ్మా'' వీటినే కిడ్నీ బీన్స్ అని పిలుస్తుంటారు. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో కొవ్వులు, లిపిడ్లు పేరుకుపోవడ
రోజూ కిడ్నీ బీన్స్ తింటే ఏమవుతుంది? - నిపుణుల సమాధానం ఇదే!


కర్నూలు, 28 సెప్టెంబర్ (హి.స.)

'రాజ్మా' వీటినే కిడ్నీ బీన్స్ అని పిలుస్తుంటారు. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో కొవ్వులు, లిపిడ్లు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని, దీంతో బరువు నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్ మేటరీ లక్షణాలు డయాబెటిస్ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయంటున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ బీన్స్ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కిడ్నీ బీన్స్ తినడం వల్ల చాలా మందిని జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్​ సమస్యలు ఇబ్బందిపెడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవి సరిగ్గా వండనప్పుడు లేదా ఎక్కువగా తిన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు. నిజానికి, వీటిని రోజు వారి డైట్​లో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయని పేర్కొన్నారు.

ప్రోటీన్ : 7.69 గ్రాములు

కార్బోహైడ్రేట్స్ : 21.5 గ్రాములు

ఫైబర్ : 5.4 గ్రాములు

కాల్షియం : 46 మిల్లీగ్రాములు

ఐరన్ : 1.38 మిల్లీగ్రాములు

పొటాషియం : 215 మిల్లీగ్రాములు

కలరీలు : 123 కేలరీలు

ఫోలేట్ (విటమిన్ B9): 130 మైక్రోగ్రాములు

మెగ్నీషియం : 45 మిల్లీగ్రాములు

ఆరోగ్య ప్రయోజనాలు :

మంచి ప్రోటీన్ మూలం: రాజ్మా మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి వనరు. శాకాహారులకు ఇది గొప్ప ఎంపిక. అధిక ప్రోటీన్ కంటెంట్ వల్ల ఇది కండరాల పెరుగుదలకు, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ నియంత్రించడం : రాజ్మా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. అంటే, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు వివరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande