కరూర్, 28 సెప్టెంబర్ (హి.స.)తమిళనాడు కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.
విజయ్ను అరెస్టు చేస్తారా!
ఇదిలా ఉండగా మృతుల సంఖ్య 39కి చేరిందని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదం ఎన్నడూ జరగకూడదని అన్నారు. ప్రస్తుతం 51 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి టీవీకే నాయకుడు విజయ్ను అరెస్టు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని, వారి నివేదిక ప్రకారం వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి