మూడు ఓటీటీ ప్లాట్ఫాంలలో కిరీటి జూనియర్.. మూవీ..
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) గాలి కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇచ్చిన చిత్రం జూనియర్ (Junior). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించిన జూనియర్ జులై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ,
జూనియర్ మూవీ


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

గాలి కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇచ్చిన చిత్రం జూనియర్ (Junior). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించిన జూనియర్ జులై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన జూనియర్ ఇక ఓటీటీలో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.

సుమారు 10 వారాల థ్రియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని కన్నడలో చూడాలనుకునే ప్రేక్షకులకు Nammaflix కూడా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ చిత్రం ఏకంగా మూడు డిజిటల్ ప్లాట్ఫాంలలో ప్రీమియర్ అయిన నేపథ్యంలో.. ఓటీటీ మూవీ లవర్స్ నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande