జీఎస్టీపై మోడీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది. తాజాగా
Modi


న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది.

తాజాగా ఇదే అంశంపై ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కణలో భాగంగా జీఎస్టీ సంస్కరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించాలని నిర్ణయించినట్లు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటన చేయడం జరిగిందని గుర్తుచేశారు. తాజాగా జీఎస్టీ సంస్కరణలో సామాన్యులకు చిన్న మధ్యతరగతి వ్యాపారులకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వారి ఆర్థిక వ్యవస్థలు బలోపేతం చేయడమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సామాన్యులు, రైతులు, MSMEలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చేలా జీఎస్టీపై సంస్కరణలు తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర , రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమిష్టిగా అంగీకరించిందని స్పష్టం చేశారు. నూతన జీఎస్టీ స్లాబులు భారతదేశంలోని పౌరులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని, ప్రతి వర్తక వ్యాపారం చేసే వ్యక్తికి నూతన జీఎస్టీ విధానంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.

సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి.. కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande