న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) వస్తుసేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి తాజాగా యూటర్న్ తీసుకుందని అన్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు తీసుకొస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం స్పదించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి 8 ఏళ్లు పట్టడం చాలా ఆలస్యమే’ అని పేర్కొన్నారు. జీఎస్టీ రూపకల్పన సరిగా లేదని కాంగ్రెస్ సహా పలువురు ఆర్థికవేత్తలు గతంలోనే ప్రశ్నించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి, పేద ప్రజలు ఈవిషయంపై గొంతెత్తినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆరోపించారు.
జీఎస్టీ(GST) ఎల్లప్పుడూ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’లా ఉండాలని చిదంబరం(Chidambaram) ఆకాంక్షించారు. తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ