ఎన్‌కౌంటర్‌ అవుతారా.. ప్రాణాలు కాపాడుకుంటారా?
న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) నక్సలైట్లందరినీ పూర్తిగా నిర్మూలించే వరకూ మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమా.. భద్రతా బలగాల చేతిలో హతంకావడమా తేల్చుకోవాలని వారిని
Amit shah


న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) నక్సలైట్లందరినీ పూర్తిగా నిర్మూలించే వరకూ మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమా.. భద్రతా బలగాల చేతిలో హతంకావడమా తేల్చుకోవాలని వారిని హెచ్చరించారు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్టును విజయవంతంగా పూర్తి చేసిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, కోబ్రా దళాలను బుధవారం దిల్లీలో ఆయన సత్కరించారు. వేడి, ప్రతికూల భౌగోళిక పరిస్థితులు, మందుపాతరల ప్రమాదాలను లెక్కచేయకుండా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్‌ క్యాంపును విజయవంతంగా ధ్వంసం చేశాయని ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande