విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం.
బెంగళూరు/న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత
German women missing case


బెంగళూరు/న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) స్పష్టత ఇచ్చారు. గురువారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాలెస్‌ మైదానంలో మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనానికి భారత గ్రాండ్‌ ముక్తిషేక్‌ అబూబకర్‌ అహ్మద్‌ ముస్లియార్‌తోపాటు యెమెన్‌ సూఫీసంత్‌ హబీబ్‌ ఉమర్‌లను ఆహ్వానించారు.

ఈ మేరకు విదేశీ ధర్మగురువులు ఇక్కడ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించరాదని, ఇది వీసా నియమాలకు ఉల్లంఘన కానుందని నిర్వాహకులకు సూచించామన్నారు. భారతదేశ చట్టాలకు అనుగుణంగా విదేశీ ధర్మ గురువులు ప్రచారాలు చేయరాదన్నారు. వారిని ఆహ్వానించి ఉండవచ్చునని, నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించరాదన్నారు. విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) కార్యక్రమాన్ని పర్యవేక్షించనుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande