న్యూఢిల్లీ,04 సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కీలక మార్పులు రానుండటం పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. దాంతో మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 680 పాయింట్లు పుంజుకొని, 81,248 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 199 పాయింట్ల ఎగబాకి 24,914 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.08గా ఉంది.
నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, గ్రాసిమ్, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, రిలయన్స్, హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ