బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా?
ముంబై, 5 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధరలను చూస్తే ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు రూ.90 వేల వరకు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు ఏకంగా లక్షా దాటేసింది. పది గ్రాములకు రూ. 99,500 నుండి రూ. 110,000 వరకు ట్రేడవుతుందని, 20
Gold


ముంబై, 5 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధరలను చూస్తే ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు రూ.90 వేల వరకు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు ఏకంగా లక్షా దాటేసింది. పది గ్రాములకు రూ. 99,500 నుండి రూ. 110,000 వరకు ట్రేడవుతుందని, 2026 ప్రథమార్థంలో రూ. 110,000 నుండి రూ. 125,000 వరకు పెరుగుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధన నోట్ తెలిపింది.

మా అంచనాల కంటే అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి భారీగా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయినట్లయితే అంచనాలకు మించి ముప్పు మరింతగా ఉండే అవకాశం ప్రమాదం ఉంది. ఈ కాలానికి డాలర్‌తో రూపాయి మారక విలువ సగటున 87.00 – 89.00 మధ్య ఉంటుందని అంచనా వేశాం’ అని నివేదిక పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande