ముంబై, 2 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా వెండి ధరలు కూడా పసడి బాటలోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు కొనసాగుతుంటాయి.. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ట్రంప్ సుంకాల ప్రభావంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి.. సెప్టెంబర్ 2 2025 మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది.
దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,05,890 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.97,060 కి చేరుకుంది.వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,26,100లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి