రంగారెడ్డి, 6 సెప్టెంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా లోని చేవెళ్ల పట్టణంలో న్యాయసేవలను మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నిర్మించిన అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ షేవిలి శనివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పలువురు జడ్జీలు, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త కోర్టు ప్రారంభం వల్ల స్థానిక ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..