హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న ఆయన, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ పౌరుడిలా వ్యవహరిస్తూ నిమజ్జన ప్రక్రియను దగ్గరగా పరిశీలించిన సీఎం రేవంత్, అధికారులను పలుమార్లు ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు