విశాఖ, 6 సెప్టెంబర్ (హి.స.)
- జిల్లా పరిషత్తు: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు (ఎస్‌హెచ్‌జీ) ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా అరకు కాఫీ ఔట్‌లెట్ల ఏర్పాటుకు అనుమతులొచ్చాయి. ఇందుకోసం డీఆర్డీఏ - వెలుగు విభాగం అధికారులు క్షేత్రస్థాయి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ సహాయంతోపాటు అనుబంధ విభాగాల ద్వారా తోడ్పాటు అందించనున్నారు. తొలిదశలో ఎనిమిది చోట్ల ఔట్‌లెట్లు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. ఉత్తరాంధ్రలోని గిరిజనులు సాగు చేస్తున్న అరకు కాఫీ ఖ్యాతి దేశ విదేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. జిల్లావాసులకు విరవివిగా అందుబాటులోకి తెచ్చేందుకు వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. వీటిల్లో అరకు కాఫీతోపాటు ఇతర ఉత్పత్తులను కూడా విక్రయించొచ్చు. ఇందుకు అవసరమైన స్థలాలను కేటాయించే ప్రతిపాదనలను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆమోదించారు. ఇవి ఏర్పాటయ్యాక డిమాండ్‌ను బట్టి మరికొన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలన్న యోచనలో అధికారులున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ