హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)
హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనంలో పాల్గొంటున్న భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఆయన, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ గణపతి నిమర్జనం అయిన క్రేన్ నెంబర్ 4 వద్ద కు వెళ్ళి పరిశీలించారు.
నిమర్జనం ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్..మండపంపై నుంచి గణపతి పబ్బా మోరియా అంటూ స్లోగన్ ఇచ్చారు..
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు