అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.)
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ తయారీ యూనిట్ గుట్టు రట్టయింది. కుత్బుల్లాపూర్‌లో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించి 32 వేల లీటర్ల ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్టు చేశారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నారు. నిందితులను ముంబయికి తరలించనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ