అనంతపురం, 6 సెప్టెంబర్ (హి.స.)
(వైద్యం), : పేద, మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరలోనే మందులు అందుబాటులో ఉంచేందుకు మండలానికో జనరిక్ ఔషధ దుకాణాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. దుకాణాల ఏర్పాటుకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని వెల్లడించారు. బీపార్మసీ, ఎంపార్మసీ పూర్తైన వారితో దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించారు. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ