కార్మిక నేత ఎల్లయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన హరీష్ రావు
హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) శుక్రవారం మృతి చెందిన బిహెచ్ఇఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య మృతదేహానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. అమీన్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో శనివారం జరిగిన ఎల్లయ్య అంత్యక్రియల్లో బీఆర్ఎస్ నాయకుల
హరీష్ రావు


హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) శుక్రవారం మృతి చెందిన బిహెచ్ఇఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య మృతదేహానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. అమీన్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో శనివారం జరిగిన ఎల్లయ్య అంత్యక్రియల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఎల్లయ్య కృషి మరువలేనిదన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం గొంతెత్తి చివరి శ్వాస వరకు కార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేశాడని కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande