సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం : మంత్రి పొంగులేటి
వనపర్తి, 6 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా, జోడెద్దుల్లా నడుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం వారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం
మంత్రి పొంగులేటి


వనపర్తి, 6 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా, జోడెద్దుల్లా నడుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం వారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఇంటి యజమానులకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టిందని, కానీ పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై చొరవ చూపలేదని విమర్శించారు. ప్రజాప్రభుత్వం రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో సన్నవరి వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. తొమ్మిది నెలల్లో రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణ మాఫీ, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వనున్నామని ప్రకటించారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, 17 లక్షల పాత కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande