మంచిర్యాల, 6 సెప్టెంబర్ (హి.స.,)
తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు . శనివారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో నిర్వహించిన మహా గర్జన సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 200కు పింఛన్ పెంచారని, దశలవారీగా ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటలతోనే 2014లో అన్ని పార్టీలు వేయి రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయని గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెయ్యి రూపాయల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు..
అనంతరం 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మార్పీఎస్ ఒత్తిడితోనే రూ. 2 వేల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు 2023లో రూ. 4వేల పెన్షన్ను ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 21 నెల లైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు