విజయవాడ, 6 సెప్టెంబర్ (హి.స.)
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ 27, 28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల (సెప్టెంబరు) 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి ఇవాళ(శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగనుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ