కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనుల వేగవంతం పై కలెక్టర్ ఆదేశాలు
నాగర్ కర్నూల్, 6 సెప్టెంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 6 సెప్టెంబర్ (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి

గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి వారం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం కనబరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో జరుగుతున్న ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇందిరమ్మ ఇండ్లు, ఎంప్లాయిమెంట్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్స్, ఆర్ అండ్ బి రోడ్ సోలార్, నాలుగు లైన్ల రహదారి పనులు, పాల శీతలీకరణ కేంద్రం, యూనియన్ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, కొత్త అంగన్వాడి భవనం, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాలు తదితర ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande