తిరుపతి.జిల్లా చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఆర్టీసీ బస్సు.ప్రమాదానికి గురైంది
అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.) తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివ
తిరుపతి.జిల్లా చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఆర్టీసీ బస్సు.ప్రమాదానికి గురైంది


అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.)

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీకి చెందిన ఓ ఎక్స్‌ప్రెస్ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తూ ఉంది. బస్సు అగరాల సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. బస్సు వెళుతున్న వేగానికి ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande