సూర్యాపేట.6 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో
మేళ్లచెరువు మండల ప్రాథమిక
వ్యవసాయ పరపతి సంఘం వద్ద శనివారం యూరియా కోసం వందలాది మంది రైతులు నిలబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుండి రైతులు క్యూలలో నిలబడి ఉండగా గిరిజన మహిళ బాణావతి బుజ్జి తీవ్ర అలసటకు గురై ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అక్కడే ఉన్న రైతులు ఆమె ముఖంపై చల్లని నీళ్ళు చిలకరించి జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎరువుల సరఫరాలో ఆలస్యం, అధిక రద్దీ, సర్వర్ సమస్యలతో రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు