గోదావరిఖని, 6 సెప్టెంబర్ (హి.స.)
సింగరేణి సంస్థలో జూనియర్
మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరొక అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గతంలో వీరంతా విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. టర్మినేట్ అయి పునర్ నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలకు ఇది తాజా నియామకంగా గుర్తించడం జరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..