భక్తులకు ముఖ్య గమనిక.. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి మూసివేత
విజయవాడ, 6 సెప్టెంబర్ (హి.స.)ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. రేపు(ఆదివారం) చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ''కవాట బంధనం''తో ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయబడుతుంది. ఈ క్రమంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్ర
విజయవాడ


విజయవాడ, 6 సెప్టెంబర్ (హి.స.)ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. రేపు(ఆదివారం) చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 'కవాట బంధనం'తో ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయబడుతుంది. ఈ క్రమంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన దేవాలయం తో పాటు ఉప ఆలయాలు అన్నింటినీ మూసివేయబడతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande