శ్రీశైలం, 7 సెప్టెంబర్ (హి.స.)
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రవణ్కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభమ్మ దంపతులకు ఆశీస్సులు ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. సంక్షోభాలు, సమస్యలు అధిగమించి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా తెలంగాణ వాళ్లకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున అమ్మవార్ల దర్శనానికి తీసుకువస్తానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు