కేటీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ర్యాలీ, భారీ బహిరంగ సభకు ప్లాన్
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయన
కేటీఆర్


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. అలాగే 13వ తేదీన గద్వాల పట్టణంలో ర్యాలీ, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతాంగ సమస్యలు, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది.

కాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఇటీవల సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో క్యాడర్ కొంత ఆందోళనలో ఉంది. పార్టీ కీలక నేత హరీశ్ రావుపై కాళేశ్వరం అవినీతి ఆరోపణలు చేయడంతో కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. పార్టీలో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande