అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)
ఏపీలిక్కర్ స్కాం కేసులోముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోహౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు). ఈ పిటీషన్‌పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న(శనివారం) బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ