ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ తో పాటు తెలంగాణ

వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని, వినాయక నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చారు.

అలాగే హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్బండ్తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande