విశాఖ, 7 సెప్టెంబర్ (హి.స.)
:HPCLలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోలియం ట్యాంక్‌పై ఒక్కసారిగా పిడుగు పడటంతో.. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అలర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను వెంటనే బయటకు పంపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ