అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వస్తువుల గోదాములో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ గోదాము గత కొన్ని నెలలుగా మూతపడి ఉందని స్థానికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ