ట్యాంక్ బండ్ పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) రెండవ రోజు ఆదివారం కూడా హైదరాబాద్ గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఆఖరి రోజు కావడంతో నగరంలో ఉన్న అన్ని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. దీంతో రెండవ ర
గణేష్ నిమజ్జన్


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) రెండవ రోజు ఆదివారం కూడా హైదరాబాద్ గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఆఖరి రోజు కావడంతో నగరంలో ఉన్న అన్ని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. దీంతో రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం వరకు ట్యాంక్ బండ్ వద్ద భారీగా క్యూ కట్టయి.. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సాయంత్రం వరకూ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande