అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)
కనిగిరి మండలం యడవల్లికి ఎట్టకేలకు గూడ్సు రైలు వచ్చింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిలాస్‌పూర్ నుంచి సుమారు 30 పెట్టెలతో నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు సంబంధించిన ట్రాక్‌లు, ఇతర సామగ్రిని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రైలుకు యడవల్లి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. భూసేకరణలో భాగంగా రైతులకు రూ.7 కోట్ల నష్టపరిహారం చెల్లింపులతో రైల్వేలైన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కనిగిరి పురపాలక సంఘం పరిధిలోని శంకవరం సమీపంలో క్వారీల నిర్వాహకులు అభ్యంతరం తెలపడంతోఒకేఒక్క వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. లేకుంటే ఈ పాటికే కనిగిరిలో రైలు కూత వినిపించేంది. ఈ నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఆర్డీవో జి.కేశవర్థన్‌రెడ్డి క్వారీల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో వంతెన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఏడాది డిసెంబరు నాటికి కనిగిరికి రైళ్లు రానున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే యడవల్లి, పోలవరం, రైలునిలయాలతోపాటు వంతెనల నిర్మాణపనులు పూర్తయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ