వరంగల్లో దంచి కొట్టిన వర్షం.. అస్తవ్యస్తమైన జనజీవనం..
తెలంగాణ, వరంగల్ 7 సెప్టెంబర్ (హి.స.) గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆదివారం వర్షం దంచికొట్టింది. వరంగల్, ఖిల్లా వరంగల్ లో రెండున్నర గంటలకు పైగా కురిసిన వర్షంతో పలు కాలనీలు జలమయ్యాయి. వర్షానికి కరీమాబాద్ పరిధిలోని డివిజన్లలో పెద్ద కాలువ పొంగి రోడ్డుపైకి, ఇ
వరంగల్ వర్షం


తెలంగాణ, వరంగల్ 7 సెప్టెంబర్ (హి.స.)

గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆదివారం వర్షం దంచికొట్టింది. వరంగల్, ఖిల్లా వరంగల్ లో రెండున్నర గంటలకు పైగా కురిసిన వర్షంతో పలు కాలనీలు జలమయ్యాయి. వర్షానికి కరీమాబాద్ పరిధిలోని డివిజన్లలో పెద్ద కాలువ పొంగి రోడ్డుపైకి, ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవహించింది. వరద నీరు రావడంతో పలు కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హన్మకొండ పరిధిలో కూడా వర్షానికి రోడ్లు జలమయ్యాయి.

భారీ వర్షానికి అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకేసారి వరద పెరగడంతో అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. వరదను పట్టించుకోకుండా అండర్ బ్రిడ్జి కిందకు వెళ్లిన రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలు చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి నీట మునిగిన అండర్ బ్రిడ్జిలో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande