హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో 62 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే పాఠశాల మొత్తం పరిశీలించారు. అంతకుముందు మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..