తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 7 సెప్టెంబర్ (హి.స.)
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఆదివారం ఉదయం మంత్రి సందర్శించారు. ఫ్యాక్టరీ తరచుగా బ్రేక్ డౌన్ కావడానికి గల కారణాలను మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆత్మ గౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమే, రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందన్నారు.
31 జిల్లాల్లో ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉంది. ఒక్కో ఉమ్మడి జిల్లాకు లక్ష ఎకరాలు చొప్పున పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు టార్గెట్గా చర్యలు చేపడుతున్నాం. సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. పామాయిల్ గెలలు టన్ను రూ.25 వేలు ఉండేలా ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి స్వయంగా కలిసి వివరించానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు