కడప, 7 సెప్టెంబర్ (హి.స.): శివారులోని భగత్‌సింగ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, స్థానికులు గమనించడం వల్ల చిన్నారి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. వెంటనే రాజ్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు.
అయితే, ఈ ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి స్పందిస్తూ.. రాజ్‌కుమార్‌పై తాలూకా పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు. అతని మీద ఇప్పటికే ఒక హత్య కేసుతో పాటు మరో ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.. చిన్నారి సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ