నిండుకుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
తెలంగాణ, నల్గొండ. 7 సెప్టెంబర్ (హి.స.) ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,33,8
సాగర్


తెలంగాణ, నల్గొండ. 7 సెప్టెంబర్ (హి.స.)

ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,33,824 క్యూసెక్కులు గా ఉంది. దీని నుండి సాగర్ కుడి కాలువకు 9500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 32,480 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. 311.14 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. కాగా.. మరోసారి సాగర్ గేట్లను ఎత్తడంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande